– విద్యార్థినులకు ఉచితంగా 309 సైకిళ్ల పంపిణీ
– రూ. కోటి 38 లక్ష సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
– ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి : వచ్చే విద్య సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఎంత మంది చదువుకునే పిల్లులు ఉంటే వారి తల్లులకు ఏడాదికి రూ.15 వేలు చెప్పును ప్రభుత్వం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో పాఠశాల విద్యను దేశంలో ప్రధమ స్థానంలో నిలిపే దిశగా ప్రభుత్వం, విద్య శాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
బాపట్ల జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల్లో 309 మంది విద్యార్థినులకు ఉచితంగా కొత్త సైకిళ్లను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. చిలకలూరిపేటకు చెందిన ఆసిస్ట్ స్వచ్ఛంద సంస్థ సాయంతో సైకిళ్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థినులకు చదువులపై ప్రోత్సాహించినట్లు అవుతుందని అన్నారు. వివిధ కారణాలతో పాఠశాల విద్యకు దూరమయ్యే బాలికల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలిపారు. గతంలో ఇదే పాఠశాల్లో కొంత మంది విద్యార్థినులకు సైకిళ్లు అందజేశామని చెప్పారు. విద్యార్థుల కోరిక మేరకు నేడు అందరికీ పంపిణీ చేసినట్లు తెలిపారు. త్వరలోనే నియోజకవర్గ పరిధిలోని అన్ని పాఠశాలల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను దేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలిపేందుకు చర్యలూ తీసుకుంటుందని వెల్లడించారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి రాష్ట్రానికి మంచి పేరు తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అసిస్ట్ సంస్థ ప్రతినిధులతో పాటు విద్యా శాఖకు చెందిన అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.