Home బాపట్ల ప్రతిభ చాటిన ఎంబిఎ విద్యార్థులు

ప్రతిభ చాటిన ఎంబిఎ విద్యార్థులు

5
0

చీరాల (DN5 News) : స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ ఎంబిఎ విభాగానికి చెందిన విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటుకున్నారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఆర్‌కె ఇంజినీరింగ్ కాలేజి నిర్వహించిన టెక్నో ఫెస్ట్ ఆర్‌కె 2కె26 పోటీల్లో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మార్కెట్ మేకర్స్ పోటీల్లో ఎంబిఎ విద్యార్థులు ఎం మణికంఠ మానస్, ఎం రాజా టీం మొదటి బహుమతిని కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. విజేతలను కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు అభినందించారు. కార్యక్రమంలో ఎంబిఎ హెచ్‌ఒడి డాక్టర్ ఆర్ ఇమ్మానియేల్, డైరెక్టర్‌ డాక్టర్ సి సుబ్బారావు, వనమా నాగ సాయినాధ్, మేనేజర్‌ ఆర్‌వి రమణమూర్తి పాల్గొన్నారు.