చీరాల : సమయానికి ఆహారం తీసుకోవటం ద్వార గ్యాస్ సమస్య దూర మవుతుందని గ్యాస్, లివరు, పైల్స్ ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ షేక్ నాగుర్ బాషా పేర్కొన్నారు. ఆదివారం శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ నిద్ర పోవటానికి రెండు గంటల ముందు భోజనం చేయాలని షుచించారు. ప్రతిరోజూ సమయానికి మితాహారం తీసుకోవాలని చెప్పారు. కొంత సమయం వ్యాయామం చేయాలన్నారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవాలన్నారు. మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని లేకుంటే లివర్ దెబ్బతింటుందని చెప్పారు.
వైద్యశాల ఎండీ తడివలస దేవరాజు మాట్లాడుతూ ప్రతి ఆదివారం గ్యాస్, లివర్, పైల్స్ నిపుణులు తమ వైద్యశాలలో అందుబాటులో ఉంటారని తెలిపారు. అదేవిధంగా నెమ్ము, జ్వరం, ఫ్లూతో పాటు ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.