చీరాల (DN5 News) : నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎంఎల్‌ఎ ఎంఎం కొండయ్య తెలిపారు. జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. ఎన్ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా జరుగుతుందని నైపుణ్యాభివృద్ధి అధికారిణి ఎం మాధవి పేర్కొన్నారు. వివరాలకు 79814 43777, 85559 01198, 91005 66581, 99499 14337, 9988853335 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.






