– తాడివలసకు పాస్టర్లచే ఘన సన్మానం
– సహాయం చేసే సహృదయం కలిగిన వ్యక్తి దేవరాజు
చీరాల : ఎల్బిఎస్ నగర్ లోని రమేష్ పాస్టర్ చర్చిలో పీస్ కమిటీ ఆధ్వర్యంలో పీటర్ రమేష్ అధ్యక్షతన ఢిల్లీలో యంగ్ అచీవర్ అవార్డు అందుకున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజుకు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమానికి హాజరైన పోతుల సురేష్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన తాడివలస దేవరాజు మన ప్రాంతవాసి అవ్వడం ఎంతో గర్వకారణమని అన్నారు. కార్పొరేట్ వైద్యశాలను చీరాలలో ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో వైద్య సేవలను అందించడం తోపాటు సామజిక సేవలో తన వంతు అనేక సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు అభినందనీయుడని అన్నారు.
పలువురు పాస్టర్లు మాట్లాడుతూ చీరాలలో ఉన్న ప్రార్థన మందిరాలకు తన వంతు సహాయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. చర్చిలకు కావలసిన వస్తువులు, వస్త్రాలు అందించి పాస్టర్లను ఆదుకున్నారని చెప్పారు. చీరాలలో ఎన్నో పాఠశాలకు, విద్యార్థులకు ఉపయోగపడే సేవలందించిన తాడివలస దేవరాజుకు ఇటువంటి అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మరెన్నో సేవలు అందించి ప్రజలకు చేరువ అవ్వాలని కోరారు. పాస్టర్స్ అసోసియేషన్, పీస్ కమిటీ సభ్యులు తాడివలస దేవరాజును పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏసుదాసు, ఏసోబు, జీవరత్నం, జోసెఫ్, కిషోర్, వందనం పాల్గొన్నారు.