Home బాపట్ల డిపోలు గ్యారేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ డబ్ల్యూ ఎఫ్ ధర్నా

డిపోలు గ్యారేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ డబ్ల్యూ ఎఫ్ ధర్నా

17
0

చీరాల (Chirala) : ఆర్టీసీ బస్టాండులు, డిపోలు, గ్యారేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్‌డబ్ల్యూఎఫ్ (SWF) ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఎస్డబ్ల్యుఎఫ్ డిపో కార్యదర్శి బి శ్రీనివాసరావు మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండులు, గ్యారేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని కోరారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం ద్వారా ఆర్టీసీ ఆస్తులు కోల్పోవడంతో పాటు వేల మంది కార్మికుల ఉపాధి, ప్రజల సౌకర్యం దెబ్బతింటుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ అందుకు తగిన బస్సులు, సిబ్బందిని పెంచకుండా ఉన్న సిబ్బందిపై భారం మోపిందని అన్నారు. అయినప్పటికీ ఆర్టీసీ సిబ్బంది అనేక ఇబ్బందులను భరిస్తూ పనిచేయడం వల్ల సమస్త మనుగడ సాగిస్తుందన్నారు. పెరుగుతున్న ప్రయాణ అవసరాలు దృష్టిలో పెట్టుకొని కొత్త బస్సులను ఆర్టీసీ యాజమాన్య నిర్వహణలో నడపాలని కోరారు. వేల పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ భర్తీ చేయకుండా ఔట్సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని తీసుకునేందుకు ప్రయత్నం చేయడమే కాకుండా ప్రైవేటీకిరించాలని కోవడం ప్రజల ప్రయాణ సౌకర్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడమేనని అన్నారు. జీవో నెంబర్ 88రద్దు చేయాలని కోరారు.

ఆర్టీసీ నియంత్రణ లేకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెబితే ప్రమాదాల తీవ్రత పెరుగుతుందని అన్నారు. ప్రయాణికులకు భద్రత ఉండదని చెప్పారు. చార్జీల భారం ప్రయానికులపై పెరుగుతుందని అన్నారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఆర్టీసీ ఎస్డబ్ల్యుఎఫ్ నాయకులు కెబికె రెడ్డి, తులసిరావు, వైవి రావు, వెంకటేశ్వర్లు, జయరావు, భాష, ఎస్ఆర్ఎం రావు, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం మాణిక్యరావు, సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు, జెవివి నాయకులు డి నారపరెడ్డి, బిఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు బట్టు సుబ్బారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి కొండయ్య పాల్గొన్నారు.