చీరాల : స్వచ్ఛ్ చీరాల సాధించడంలో పట్టణంలోని ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ షేక్ ఫజులుల్లా కోరారు. సోమవారం మునిసిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారిగా కాకుండా ఒక బాధ్యత గల పౌరుడిగా అధికారులు అందరూ కలిసి రావాలని కోరారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచులు మాత్రమే వాడాలని అన్నారు. డ్రైనేజీలు బ్లాక్ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
డ్రైనేజీలలో ఆహార వ్యర్ధాలను నిర్లక్ష్యంగా వదిలేస్తే అవి మూసుకుపోయి మురుగునీరు నిల్వ ఉంటుందన్నారు. దీంతో దోమలకు నిలయంగా మారతాయన్నారు. మనకే చివరికి ముప్పు ఏర్పడేందుకు అవకాశం ఉందన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో భాగంగా రెస్టారెంట్స్, హోటళ్ళు, బార్లు యజమానులు, ఇతర వ్యాపారస్తులకు తగు సూచనలు ఇచ్చారు.