చీరాల : స్వచ్ఛ సర్వేక్షణ్-2019 లో భాగముగా చీరాల పురపాలక సంఘము ఆద్వర్యములో పట్టణములోని మహిళలకు శనివారం చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ ప్రాంగనణంలోని ఓపెన్ ఎయిర్ ధియేటర్‌లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో 200మంది మహిళలు రంగవళ్లలు వేశారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతిగా ఫ్రిడ్జ్, ఆకర్షణీయమైన చీర, రెండవ బహుమతి గ్రైండరు, మూడవ బహుమతి మిక్సీ, నాల్గవ బహుమతి వెండి కుందులు అందజేశారు. 5వ స్ధానము నుండి-15 వ స్ధానము వరకు గెలుపొందిన విజేతలకు రూ.500/-లు నగదు బహుమతి ఇచ్చారు. పోటీల్లో పాల్గొన్నవారందరికీ స్టీలు బాక్సులు అందజేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ద్వితీయ స్థానంలో ఉన్న చీరాలను మొదటి స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రజలు సహకరించాలని కమీషనర్ షేక్ ఫజులుల్లా కోరారు. కార్యక్రమంలో సానిటరీ విభాగ అధికారి మహ్మద్ బషీర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.