బాపట్ల (DN5 News) : వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల (ఐ అండ్ పిఆర్) శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్వర్ణాంధ్ర@2047’ క్యాలెండర్లను కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాగంగా స్వర్ణాంధ్ర@2047 క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం పేదరిక నిర్మూలన, ఉపాధి, ఉద్యోగ కల్పన, నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి, వ్యవసాయంలో సాంకేతికత, ప్రపంచ స్థాయి రవాణా, స్వచ్ఛ ఆంధ్రని దశల్లో సమగ్ర సాంకేతికత మొదలైన 10 సూత్రాలతో విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఈ పది సూత్రాల ప్రాధాన్యత వివరిస్తూ ‘స్వర్ణాంధ్ర@2047’ అంశంతో రూపొందించిన 2026 క్యాలెండర్లను జిల్లా, మండల స్థాయి కార్యాలయాలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు పంపిణీ చేయాలని సమాచార శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన, డిఆర్ఓ జి గంగధర్ గౌడు, ఐ అండ్ పిఆర్ ఎడి పి వెంకట రమణ, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, డిప్యూటీ కలెక్టర్ లవన్న పాల్గొన్నారు.






