కారంచేడు : స్వర్ణ గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యాదవ్ యూత్ సభ్యులు కొంతమంది కలిసి కోవిడ్ బాధితులకు తమ వంతు సహాయం అందజేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, సిబ్బంది, ఆశ వర్కర్ల ద్వారా బాధితులకు అవసరమైన పోషకాహారానికి సంబంధించి డ్రైఫ్రూట్స్, సర్జికల్ మాస్కులు, శానిటైజర్, వేపరైజర్ లు సమాకూర్చారు. స్కై యూత్ సభ్యులంతా వివిధ ప్రాంతంలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ తమ వంతుగా పేదలకు సహాయం చేయాలన్న సంకల్పంతో ముందుకొచ్చి నిధులు సమాకుర్చుకుని పంపిణి చేశారు.
భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని యువకులు పేర్కొన్నారు. గ్రామంలోని పెద్దలు ముందుకొచ్చి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఏదైనా అవసరమైతే తమ వంతు సాయంగా ముందుంటామని తెలిపారు. ఆర్థిక సహాయం అందించిన ఎన్ వెంకటేష్, కె శ్రీరామ్, గోపి, నాగేశ్వరరావు, యం హరి, కె నాగరాజు, కె మురళి, కె శ్రీనివాస్, వై శివకృష్ణ, ఎన్ సుబ్బారావు, వై గోపి, ఎన్ రాజేష్, కె అశోక్ లను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ యం విక్టర్ పాల్, ల్యాబ్ టెక్నీషియన బయ్య శంకర్, హెచ్ఈ మీనా కుమారి, సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.