ఢిల్లీ: తనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు వస్తున్న వార్తలపై బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. తాను ఏపీకి గవర్నర్‌గా నియామకం కానున్నట్లు వస్తున్న వార్తలు ఆవాస్తవమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన అధికార ట్విటర్‌లో పేర్కొన్నారు. దిల్లీలో సోమవారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తారని ప్రచారం జరిగింది. ఏపీకి గవర్నర్‌గా సుష్మా స్వరాజ్ వస్తారని, తెలంగాణకు నరసింహన్ కొనసాగడం లేదా కొత్తగా మరో సీనియర్ నేతను తీసుకొస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుష్మాస్వరాజ్ గవర్నర్‌గా నియామకంపై క్లారిటీ ఇచ్చారు.