Home క్రైమ్ సూర్యలంక వద్ద హత్య కేసులో నిందితుడి అరెస్టు

సూర్యలంక వద్ద హత్య కేసులో నిందితుడి అరెస్టు

95
0

బాపట్ల (Bapatla) : రూరల్ పోలీస్ స్టేషన్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు మాట్లాడారు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యలంక గ్రామ శివారు చప్టా సమీపంలో బాపట్ల, సూర్యలంక రోడ్డు పక్కన నిద్ర గన్నేరు చెట్టు వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ తుషార్ డూడి (SP Tushar Dudi) అభినందించారు.

నేరం జరిగిన తీరు
మృతుడు బాపట్ల పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో ఫైనాన్సు వ్యాపారం చేస్తున్నాడు. సుమారు ఒక నెల క్రితం ఆదర్శనగర్ గ్రామానికి చెందిన ముద్దాయి కొక్కిలిగడ్డ చంద్ర శేఖర్ అలియాస్‌ చిన్ను అనే వ్యక్తి మృతుని వద్ద గుమస్తాగా ఆగష్టు 1న పనికి చేరాడు. అప్పటి నుంచి ముద్దాయి డబ్బులు వసూలు చేస్తే క్రమంలో ముద్దాయికి తెలిసిన వారికి కూడా అతని ద్వారా మృతుని దగ్గర నుండి కొంత డబ్బులు ఇప్పించాడు. ముద్దాయి ఇప్పించిన డబ్బులను మృతునికి వసూలు చేసి ఇవ్వకుండా మృతుడుకి ఫైనాన్స్ డబ్బులు గురించి సరిగా లెక్కలు చెప్పడం లేదు.

మృతుడు గ్రామాల్లో ఇచ్చిన ఫైనాన్స్ డబ్బులన్ని లెక్కలు చూస్తే సుమారు రూ.30లక్షల వరకు ఉండగా మృతుడిని ఎవరూ లేని సమయంలో అడ్డు తొలగిస్తే మృతుడు పైనాన్సు డబ్బులన్ని ముద్దాయి వసూలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో, పైగా మృతుడు డబ్బులు వసూలు చేసే విషయంలో తిడుతున్నందున ఎలాగైనా మృతుడుని చంపి తన ఫైనాన్స్ డబ్బులను తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. ముద్దాయి తన దగ్గర ఉన్న కోడి కత్తిని జేబులో పెట్టుకుని మృతుడు సెప్టెంబర్‌ 16న సాయంత్రం సుమారు 4గంటలకు ఫోన్ చేసి ఫైనాన్సు డబ్బులు వసూళ్లకు వెళదాం రమ్మని చెప్పి మృతుడిని పిలిచాడు.

వెంటనే ముద్దాయి చెప్పిన ప్రకారంగా ఇంటి వద్ద నుండి వచ్చి ముద్దాయిని ఎక్కించుకుని ఫైనాన్స్ డబ్బులు వసూళ్లు చేయించుకోవడానికి సూర్యులంక వెళుతుండగా సుమారు 5గంటల సమయంలో సూర్యలంక రోడ్డులో చప్టా దగ్గరలో గల నిద్ర గన్నేరు చెట్టు వద్దకు వెళ్లేసరికి మృతుడుని బండి కొంచెం ఆపమని చెప్పినట్లు, అంతట మృతుడు బండి స్లో చేయగా ముద్దాయి నువ్వు పదేపదే నన్ను తిడితే నేను డ్యూటీలో ఉండనని చెప్పి గొడవపడి ఆ సమయంలో ముద్దాయి ఎలాగైనా చంపుదామనే ఉద్దేశంతో ఇంటి వద్ద నుండి తెచ్చుకున్న కత్తిని జేబులో నుండి తీసి మృతిని కుడి దవడ దగ్గర పొడవగా, మృతుడు పెద్దగా కేక వేస్తూ తన చేత్తో ముద్దాయిని నెట్టగా ఆ సమయంలో ఆ కత్తి ముద్దాయి కుడిచేతి చిటికెన వేలకి కొద్దిగా తెగింది.

ముద్దాయి వెంటనే లేచి మృతుడుని మరల పొడిచే లోపల మృతుడు తప్పించుకుని తన బండి వేసుకొని సూర్యలంక రోడ్డు వైపు మెడపైన గాయంతో బండిపైన సూర్యలంక గ్రామంనకు వచ్చి, దోమ వెంకటరావు అనే అతని కిరణా షాప్ వద్ద పడిపోయి తనని కొక్కిలిగడ్డ చంద్ర శేఖర్ అనే వ్యక్తి ఫైనాన్సు డబ్బులు విషయంలో గొడవపడి చంపాలనే ఉద్దేశంతో కత్తితో పొడిచినట్లు గోవర్ధన్ అనే వ్యక్తికి చెప్పి చనిపోయాడు. సెప్టెంబర్ 22న సాయంత్రం 5గంటలకు మధ్యవర్తుల సమక్షంలో నిందితుడిని పందెంకోడి రెస్టారెంట్ సమీపంలో బాపట్ల, సూర్యలంక రోడ్ వద్ద బాపట్ల రూరల్ సిఐ కె గంగాధర్ తన సిబ్బంది సహాయంతో అరెస్టు చేశారు.

కేసు దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి భౌతిక సాక్ష్యాధారాలను, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సేకరించిన ఆధారాలు ఒకదానికొకటి క్రోడీకరించుకొని సంబంధిత న్యాయస్థానంలో ముద్దాయిలపై చార్జి షీట్ దాఖలు చేసి న్యాయస్థానంలో ముద్దాయిలకి కఠిన మైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ జి రామాంజనేయులు తెలిపారు. కేసు ఛేదనలో విశిష్ట కృషి చేసిన అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్, డిఎస్పీ జి రామాంజనేయులు, బాపట్ల రూరల్ సిఐ కె గంగాధర్, బాపట్ల రూరల్ పోలీసు సిబ్బందిని ఎస్పీ తుషార్‌డూడి అభినందించారు.