Home బాపట్ల ఇంటర్మీడియట్‌ పరీక్షల పర్యవేక్షణ

ఇంటర్మీడియట్‌ పరీక్షల పర్యవేక్షణ

8
0

బాపట్ల (DN5 News) : ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (Dr.V.Vinod Kumar IAS) తెలిపారు. చెరుకుపల్లి మండలం కావూరు, చెరుకుపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తీరును పరిశీలించారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రైవేట్ కళాశాలకు 67 మందిని కేటాయించగా, 64 మంది విద్యార్థులు హాజరయ్యారని, మిగిలిన ముగ్గురు గైర్హాజరైనట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ లక్ష్మీతిరుపతమ్మ ఆయన దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ కళాశాలకు 44 మందిని కేటాయించగా అందరూ హాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ వి భారతి వివరించారు. ఆయా కేంద్రంలో సౌకర్యాలు పరిశీలించారు. పరీక్షా కేంద్రం నిర్వహణ, పర్యవేక్షణ, పోలీసు బందోబస్తు పరిశీలించారు.