ప్రతిభకు వయస్సు, అందంతో సంబంధంలేదని నిరూపించింది ఓ మహిళ. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన ‘ఏక్ ప్యార్‌కి నగ్మా’ పాటను పాడి తన గాన మాధుర్యంతో ఎందరో హృదయాలను హత్తుకున్నారు. ‘బర్పెటా టౌన్ ద ప్లేస్’ అనే ఫేస్ బుక్ పేజీ ఆమె టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.
పశ్చిమబెంగాల్ రణఘాట్ రైల్వే స్టేషన్లో ఉన్న ఆమె ‘ఏక్ ప్యార్‌కి నగ్మా’ పాటను పాడి వీడియోను జులై 28న పోస్ట్ చేశారు. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. అచ్చం లతా మంగేష్కర్‌గా పాడుతోందని ప్రశంసించారు. ఇప్పటివరకూ ఈ వీడియో 16 లక్షల వ్యూస్ సాధించింది. 35 వేల మందికి పైగా ఆమె వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో హిట్ కావడంతో మరో పాట కూడా పాడి పోస్ట్ చేశారు ఆమె.