చీరాల : చేనేత ఐక్యవేదిక సమావేశం ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో నిర్వహించారు. సమావేశంలో చేనేత వృత్తి రక్షణకు వివిధ రకాల తీర్మానాలు చేశారు. అవేమిటో తెలుసా…ఇవిగో… క్రింది అంశాలు చూడండి.
– చేనేత కార్మికులకు పరపతి సౌకర్యం కల్పిస్తూ రూ.1500కోట్లతో ఇతర బిసి కులాల కార్పొరేషన్ల తరహాలో చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
– చేనేతకు ఉపయోగించే ముడి సారుకుపై తెలంగాణా తరహాలో 40శాతం రాయితీ ఇవ్వాలి.
– తమిళనాడు తరహాలో చేనేతలకు 100యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి.
– రూ.400కోట్లతో తమిళనాడు తరహాలో ఉచిత చీర, ధోవతి పధకం అమలు చేయాలి.
– రాష్ట్ర జనాభాలో 12శాతంగా ఉన్న చేనేతలకు అన్ని రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపదికన రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయించాలి. చీరాల సీటు చేనేతలకు ఇవ్వాలి.
– తిరుపతిలోని పద్మావతి అమ్మవారి పద్మశాలిలా ఆడపడుచు అయినందున తిరుపతి బోర్డులో సభ్యత్వం ఇవ్వాలి.
– చేనేత వృత్తి అభివృద్ధి, వృత్తి రక్షణ నిమిత్తం రాష్ట్ర బడ్జెట్లో రూ.1000కోట్లు కేటాయించాలి.
– చేనేత వృత్తికి జీవమైన చిలప నులుపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5శాతం జిఎస్టీ తక్షణం రద్దు చేయాలి.
– చేనేత వస్త్రాలపై విధించిన 18శాతం జిఎస్టీ ఎత్తివేయాలి.
– చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలి
– చేనేత క్లస్టర్లలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరపాలి.
ఇలాంటి అనేక అంశాలపై సమావేశంలో తీర్మానాలు చేశారు. సమావేశంలో న్యాయవాది వై కోటేశ్వరరావు, చేనేత సంక్షేమ సంఘం నాయకులు పడవల లక్ష్మణస్వామి, చేనేత కార్మిక సంఘం నాయకులు బండారు జ్వాలానరసింహారావు, దళిత చేనేత కార్మిక సంఘం నాయకులు మద్దు ప్రకాశరావు, మాజీ ఎంపిపి దామర్ల శ్రీకృష్ణ, చేనేత కాంగ్రెస్ నాయకులు గుంటి ఆదినారాయణ పాల్గొన్నారు.