Home ఆధ్యాత్మికం రామనంద సరస్వతి ఆశ్రమం ఆవరణలో ఉచిత షుగరు వైద్యశిభిరం

రామనంద సరస్వతి ఆశ్రమం ఆవరణలో ఉచిత షుగరు వైద్యశిభిరం

742
0

చీరాల : ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు శ్రీశ్రీశ్రీ రామనంద సరస్వతి ఆశ్రమం ఆవరణలో ప్రతినెలా నాలుగో ఆదివారం ఉచిత షుగరు వైద్యశిభిరం నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 26నెలలుగా క్రమం తప్పకుండా ప్రతినెలా సుమారు మూడు వేల మంది వరకు రోగులు హాజరవుతున్నారు.

గుంటూరు వైద్యకళాశాల విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజారాజేశ్వరి పర్యవేక్షణలో వైద్యబృందం రోగులకు వైద్య పరీక్షలు చేశారు. రక్తపరీక్షలు, బిపి, షుగర్, థైరాయిడ్ వంటి పరీక్షలు చేసిన తర్వాత రిపోర్టులు ఆధారంగా రోగికి నెలరోజులకు అంటే మళ్ళీ వైద్య శిబిరం జరిగేవరకు సరిపడు మందులు ఉచితంగా అందించారు.

దూరప్రాంత రోగులు ముందురోజు రాత్రే శిబిరం వద్దకు చేరుకున్నారు. వైద్య బృందం వేకువజాము నుండే పరీక్షలు చేయడం ప్రారంభించారు. ట్రస్ట్ ప్రతినిధులు హాజరైన రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అల్పాహారం, తాగునీరు ఉచితంగా అందించారు.

ఆదివారం జరిగిన వైద్యశిభిరం 1617మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా నెలకు సరిపడు మందులు పంపిణీ చేశారు. ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ లలిత్ ప్రకాష్ చంద్ర, డాక్టర్ పేట శ్రీకాంత్, డాక్టర్ రవికాంత్, డాక్టర్ సుధాకర్ యాదవ్ వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, మేనేజర్ ఎన్ సురేష్, గోపాల్, బసవరావు, ఎంజి శంకరరావు, వాడరేవు జెడ్పి ఉన్నత పాఠశాల, చీరాల ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.