Home బాపట్ల అందుబాటులో రబీ సీజనుకు సరిపడా యూరియా : కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్

అందుబాటులో రబీ సీజనుకు సరిపడా యూరియా : కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్

5
0

బాపట్ల : రబీ సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరి 10 నుండి రాబోయే 21 రోజులకుగాను 7960 మెట్రిక్ టన్నుల యూరియా పిఎసిఎస్‌లలో 1435 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉందని డాక్టర్ వి.వినోద్ కుమార్ మంగళ వారం తెలిపారు. జిల్లాలోని రైతు సేవ కేంద్రాల్లో 1607 మెట్రిక్‌ టన్నులు, సహకార మార్కెటింగ్ సోసైటీల్లో 207మెట్రిక్‌ టన్నులు, ప్రైవేట్ రిటైల్ వ్యాపారుల దగ్గర 1915 మెట్రిక్‌ టన్నులు మార్క్‌ఫెడ్ గోదాముల్లో 2500 మెట్రిక్‌ టన్నులు, టోకు వ్యాపారుల దగ్గర 276 మెట్రిక్‌ టన్నులు, కంపెనీ గోదాముల్లో 20 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.