పంగులూరు (Panguluru) : మండలంలోని బూదవాడ (Budavada) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో మంగళవారం మండల స్థాయి సైన్స్ ఫెయిర్ 2025 విజయవంతంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు ప్రదర్శించారు. వ్యక్తిగత విభాగంలో బూదవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్ ఆస్మిని ప్రధమ స్థానం, కొండ మంజూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పి హితేంద్ర ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. బూదవాడ పాఠశాలకు చెందిన జి హరిణి, వి సుమశ్రీ ప్రధమ బహుమతి సాధించగా, కొండ మంజూరు పాఠశాలకు చెందిన కె జాకబ్ జపాన్, ఎన్ వెంకట చరణ్ ద్వితీయ స్థానం దక్కించుకున్నారు.
ఉపాధ్యాయ విభాగంలో బూదవాడ పాఠశాలకు చెందిన ఐ చంద్రశేఖరరావు దక్కించుకున్నారు. ఎంఇఒలు కె నాగభూషణం, జి వీరాంజనేయులు మాట్లాడుతూ విజేతలైన అభ్యర్ధులు ఈనెల 19న జిల్లా కేంద్రమైన బాపట్లలో జరిగే జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రదర్శనకు వాడరేవు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎస్‌కె మీరాజాన్, వేముల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కె స్వర్ణలత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం పూసల రఘురామయ్య, అజిత్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డవల్లి వీరనారాయణ, వివిధ పాఠశాలలకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసి చైర్మన్ అలవల శ్రీనివాసరెడ్డి, కొమ్మారెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.






