– విద్యార్థులు బాధ్యతతో చదువుకోవాలి. – పదవ తరగతి కీలక దశ విద్యాభ్యాసంలో. – పేద విద్యార్థులకు అండగా రోటరీ చీరాల : జేమ్స్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు రోటరీ క్లబ్ ప్రతినిధులు యుటిఎఫ్ స్టడీ మెటీరియల్ అందజేశారు. పరీక్షలు దగ్గరపడుతున్న సందర్భంలో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేవిధంగా ఈ స్టడీ మెటీరియల్ ను అందజేస్తున్నట్లు క్లబ్ ప్రధమ ప్రెసిడెంట్ అడ్డగడ మల్లికార్జునరావు అన్నారు.
క్లబ్ కార్యదర్శి తాడివలస దేవరాజు మాట్లాడుతూ విద్యార్థులు సమయం వృధా చేయకుండా ఇష్టంగా చదువుకోవాలని ఆశీర్వదించారు. విద్యార్థి జీవితంలో 10వ తరగతి ఎంతో కీలకమైందని అందరూ కష్టపడి చదివి స్కూల్ కి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. క్లబ్ అధ్యక్షుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు అందరూ మంచి గ్రేడ్ తో పాస్ అవ్వాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాధర్, కరిముల్లా, చైతన్య, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.