Home బాపట్ల కౌశల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

కౌశల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

23
0

పంగులూరు (Panguluru) : జిల్లా స్థాయిలో నిర్వహించిన కౌశల్ పోటీల్లో మండలంలోని కొండ మంజులూరు (KondaManjuluru) జెడ్‌పి ఉన్నత పాఠశాల (ZPHSchool) విద్యార్థులు ప్రతిభ చాటారు. పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పి అంకమ్మ పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో జిల్లా ప్రథమ స్థానాన్ని పొందారు. ఈనెల 27న నిర్వహించే రాష్ట్ర స్థాయి కౌశల్ పోటీలకు అర్హత సాధించాడు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వై వర్షశ్రీ క్విజ్‌లో ద్వితీయ స్థానం సాధించింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పి ఈమల మణికంఠ పోస్టర్ ప్రజెంటేషన్‌లో ద్వితీయ స్థానం సాధించారు. విద్యార్థులను సైన్స్ ఉపాధ్యాయులు ఎ శ్రీనివాసరావు, పి కాలేషావళి, పి చంద్రశేఖర్, గణిత ఉపాధ్యాయులు ఎస్‌కె అబ్దుల్ సమద్‌ను పాఠశాల హెచ్‌ఎం ఇమ్మడిశెట్టి అనిత అభినందించారు.