Home బాపట్ల శక్తి యాప్‌పై విద్యార్ధులకు అవగాహన

శక్తి యాప్‌పై విద్యార్ధులకు అవగాహన

6
0

చీరాల (DN5 News) : మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుందని శక్తి టీం ఎస్‌ఐ ఎ హరిబాబు అన్నారు. ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మోయిన్ సూచనలతో హరిప్రసాద్ నగర్ నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. వన్ టౌన్ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 181, 1091, 1098 హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు పోక్సో చట్టం, మహిళల రక్షణ కోసం స్వీయ రక్షణ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ శక్తి బృందం కానిస్టేబుల్ కె సుబ్బారావు, కాలేజ్ ప్రిన్సిపల్ దివ్య పాల్గొన్నారు.