Home బాపట్ల పోలీసు స్టేషన్‌లో పనితీరుపై విద్యార్ధులకు అవగాహన

పోలీసు స్టేషన్‌లో పనితీరుపై విద్యార్ధులకు అవగాహన

10
0

చీరాల (DN5 News): ఎస్పీ బి ఉమామహేశ్వర్ (B Umamaheswar IPS) ఆదేశాల మేరకు చీరాల డిఎస్పీ ఎండి మోయిన్ సూచనలతో మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా చీరాల వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ‘ఓపెన్ హౌస్’ (Open House) కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సిఐ ఎస్ సుబ్బారావు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో స్టేషన్‌ను సందర్శించారు. పోలీసు స్టేషన్ పనితీరు, ప్రజలకు పోలీసులు అందించే సేవలు క్షేత్రస్థాయిలో వివరించడమే లక్ష్యంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు విద్యార్థులకు పోలీసు స్టేషన్‌లోని వివిధ విభాగాలను చూపిస్తూ వివరించారు. ఫిర్యాదు ఎలా చేయాలి, ఎఫ్‌ఐఆర్ (FIR) ఎలా నమోదు చేస్తారనే అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ ప్రాముఖ్యత వివరించారు. ఆపద సమయంలో భయం వీడి పోలీసులను ఎలా ఆశ్రయించాలో తెలిపారు. మహిళలు, బాలికల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యమని చెప్పారు.

స్టేషన్‌లో అందుబాటులో ఉన్న కమ్యూనికేషన్ పరికరాలు, రికార్డులు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు ప్రయోగాత్మక వివరించారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో, విద్యార్థుల్లో ఉన్న అపోహలు తొలగించి, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచడమే ‘ఓపెన్ హౌస్’ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.