Home బాపట్ల విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండాలి : కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండాలి : కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

9
0

బాపట్ల (DN5 News) : పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్ధుల హాజరు నూరుశాతం ఉండాలని కలెక్టర్‌ డాక్టర్‌ వి వినోద్‌కుమార్‌ (Vinod Kumar IAS)స్పష్టం చేశారు. విద్యా సంస్థల నిర్వహణపై విద్యా శాఖ అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం సోమవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన అందించాలని చెప్పారు. 10వ తరగతి, మిగిలిన తరగతుల విద్యార్థుల పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగాలని అన్నారు. విద్యార్థుల ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. వేటపాలెం మండలంలో విద్యార్థుల హాజరు 87 శాతం ఉండడంపై ఆరా తీశారు. గైర్హాజరు ఉంటే డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశం ఉన్నందున, పిల్లలందరూ పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఉపాధ్యాయుల హాజరు నూరు శాతం ఉండాలని, చెరుకుపల్లి మండలంలో ఉపాధ్యాయుల హాజరు 84 శాతం ఉండడం ఏమిటని ప్రశ్నించారు. మధ్యాహ్నం భోజన పథకం అమలులో చుండూరు మండలం 93 శాతమే ఉండడం ఏమిటని నిలదీశారు. విద్యార్థులకు ఐరన్ మాత్రలు పంపిణీలో ఇంకొల్లు మండలం చాలా తక్కువగా ఉండడంపై ప్రశ్నించారు. మండలాలలోని ప్రభుత్వ పాఠశాలలను సచివాలయాల ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు విధిగా పరిశీలన చేయాలన్నారు. చిన్నగంజాం మండలంలో పరిశీలనలు 70 శాతమే ఉంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంపిడిఒలు పర్యవేక్షణ చేయాలన్నారు.

సచివాలయాల సిబ్బంది డిప్యూటేషన్లు రద్దు చేయాలని తెలిపారు. ఇప్పటికే 50 మంది డిప్యూటేషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చామని అన్నారు. వాటిని తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. మరి కొంతమంది ఉన్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో ఎంపిడిఒలు స్పష్టమైన నివేదిక పంపాలన్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియ కొల్లూరులో 87.50 శాతం అండగా చీరాల, మార్టూరు, పిట్టలవానిపాలెం, పర్చూరు, ఇంకొల్లు మండలాలలోనూ ఇదే పరిస్థితి కొనసాగడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఇకేవైసి పెండింగులో ఉండడంపై ఆరా తీశారు. 500 మంది సర్వేలు ప్రారంభించకపోవడంపై నిలదీశారు. సచివాలయాల సిబ్బంది సక్రమంగా పనిచేసేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డిఇఒ శ్రీనివాస్ సింగ్, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డ్ సచివాలయాల జిల్లా ఇన్చార్జి విజయలక్ష్మి, సచివాలయాల జిల్లా కో ఆర్డినేటర్ పి యశ్వంత్, ఎంపిడిఒలు, ఎంఈఓలు పాల్గొన్నారు.