వేటపాలెం : వేటపాలెం సచివాలయం ఆవరణలో శాసన సభ్యులు ఎంఎం కొండయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో తహశీల్దారు పార్వతి, ఆప్కో చైర్మన్ సజ్జ హేమలత, ఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధనరావు, తెలుగుదేశం అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, పర్చూరు, చీరాల టిడిపి, జనసేన కోఆర్డినేటర్ పొగడదండ రవికుమార్ పాల్గొన్నారు. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్, ఇళ్ల స్థలాలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా సానుకూలంగా స్పందించారు. త్వరగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.