Home క్రీడలు 19 నుండి రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలు

19 నుండి రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలు

46
0

పంగులూరు (Panguluru) : ఈనెల 19 నుండి 21 వరకు పంగులూరులో రాష్ట్రస్థాయి ఖో ఖో (State level Kho Kho) పోటీలు నిర్వహిస్తున్నట్లు ఖో ఖో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాచిన చెంచు గరటయ్య (Garataiah) చెప్పారు. స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి (Magunta), బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాల క్రీడా ప్రాంగణంలో 44వ జూనియర్ బాల బాలికల (అండర్ 18) రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలు వైభవంగా జరగనున్నాయని అన్నారు. గ్రామస్తుల సహకారంతో రాత్రి, పగలు ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలకు వచ్చే క్రీడాకారులు, అతిథులు, కోచ్‌లు, మేనేజర్లు, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, వాలంటీర్లు మొత్తం వెయ్యి మంది వరకు ఉంటారని అన్నారు. వీరందరికీ భోజన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.

పోటీలకు హాజరయ్యే బాలురకు స్థానిక కళాశాల క్యాంపస్‌లో వసతి కల్పిస్తున్నామని, బాలికలకు గ్రామస్తుల వసతి గృహాలు, కోచ్‌లు, మేనేజర్లకు స్థానిక చర్చి క్యాంపస్‌, అతిధులకు గ్రామస్తుల వసతి గృహాలు, రోటరీ క్లబ్‌లో కల్పిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి ఖో ఖో పోటీల్లో పాల్గొంటారని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు మేకల సీతారాంరెడ్డి తెలిపారు. భోజన సౌకర్యాన్ని స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు వసంత రఘుబాబు, గ్రామ పెద్దలు ఇమ్మడిశెట్టి సుబ్బారావు, రాయిని విశ్వేశ్వరరావు, బాచిన చౌదరి బాబు, బాచిన నాగార్జున, రాయిని వెంకట సుబ్బారావు, తెలుగుదేశం మండల అధ్యక్షులు రావూరు రమేష్ బాబు, రావూరి రంగారావు పాల్గొన్నారు.