చీరాల : రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు గురువారం ప్రకాశం జిల్లా చీరాల కస్తూరిబా గాంధీ మున్సిపల్ బాలికొన్నత పాఠశాల్లో ప్రారంబయ్యాయి. వివిధ జిల్లాల్లో నుండి కళాకారులు నాటికలు ప్రదర్శించేందుకు కళాకారులు చీరాల చేరుకున్నారు. మొదటిరోజు కుటుంబ ప్రాముఖ్యతను వివరిస్తూ రచించిన తలుపులు తెరిచే ఉన్నాయి నాటిక ప్రదర్షించారు. నాటిక ఆద్యంతం చూసిన ప్రేక్షకుల కళ్ళు చెమర్చేలా కళాకారులు అభినయించారు. ఈ నాటిక పోటీలు 26, 27తేదీల్లో కూడా ప్రదర్శింపబడతాయని నిర్వహుకులు తెలిపారు.
నాటిక పోటీల ప్రారంభ సభలో జెడ్పి చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికులు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, మానవత్వ విలువల రక్షణలో కళాకారులు ఇద్దరు మంచి దేశ భక్తులని చెప్పారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ జంజానం శ్రీనివాసరావు, కలాంజలి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పివి ప్రసాద్, గీతా ట్రస్ట్ చైర్మన్ వలివేటి మురళీకృష్ణ, చుక్కపల్లి రామకోటయ్య పాల్గొన్నారు.