వేటపాలెం : సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ బిటెక్ (ఇఇఇ ) ఆఖరి సంవత్సరం విద్యార్ధులకు వీడ్కోలు సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీశ్ బాబు మాట్లాడుతూ విద్యార్ధులు ఆధునిక టెక్నాలజిలైన ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ ఎనర్జి వంటి వాటిపై దృష్టి సారించి వాటిపై కృషి చేసి ఉన్నతస్ధాయిలో స్దిరపడటానికి అన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఇఇఇ విభాగాధిపతి డాక్టర్ ఎస్‌విడి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజిని ప్రజలకు అందుబాటులో తెచ్చి విద్యార్ధులు సమాజ అభివృధ్దికి దోహద పడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. ఇఇఇ విభాగం మూడవ సంవత్సరం విధ్యార్ధులు ఆఖరి సంవత్సర విద్యార్ధులకు జ్ఞాపికలు అందజేశారు. ఆఖరి సంవత్సరం విద్యార్ధులు తమ సందేశాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డాక్టర్ సిఎస్ రావు, డైరక్టర్ (అక్రిడిటేషన్స్) వివిధ విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.