చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు జాతీయ స్ధాయిలో లోటస్ పెటల్ ఫౌండేషన్ విన్ని సన్ స్కాలర్‌షిప్‌ను సాధించారని కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. జాతీయ స్ధాయి ఇంటర్వూలో నెగ్గీ 4సంవత్సరాల పాటు విన్ని సన్ స్కాలర్‌షిప్ సాధించుకున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కె జగీదష్ బాబు తెలిపారు. కళాశాల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో మొదటి సంవత్సం విద్యార్ధిని ఎస్ విజయ రేణుకకు ఏడాదికి రు.62300 చొప్పున నాలుగేళ్లపాటు స్కాలర్‌షిప్ అందజేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఆమెను అభినందించారు. కార్యక్రమంలో ఫస్ట్ ఇయర్ ఇన్‌చార్జ్ ఎస్ అమరనాధ్ బాబు, సిఎస్‌ఇ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి పాల్గొన్నారు.