చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు వీడ్కోలు సభ సంయక్ 2కె25 నిర్వహించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణా రావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్‌బాబు మాట్లాడుతూ శాసన సభ్యులు మద్దులూరి మాలకోండయ్య, టెక్ మహీంద్ర కంపెనీకి చెందిన టెక్ లీడ్ ఎం వెంకట గోపీ చంద్ అతిధులుగా వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు ఎంఎం కొండయ్య మాట్లాడుతూ విద్యార్ధులు సరైన లక్ష్యాలు ఎర్పరుచుకొని దాని సాధనకు తీవ్ర కృషిచేసి ఉన్నత స్ధాయిలో స్ధిర పడాలని ఆకాంక్షించారు. కొత్తగా ఎర్పడిన కూటమి ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని అన్నారు. దాని కొరకు రూ.వేలకోట్ల పెట్టుబడులతో దేశ విదేశాల సంస్దలు, పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు కృషిచేస్తున్నారని తెలిపారు.
విద్యార్ధులు పట్టుదలతో తమ శక్తి యుక్తులను ధారపోసి, నిరాశ నిస్పహయత లేకుండా లక్ష్య సాధనకు తీవ్రకృషి చేయాలని తెలిపారు. జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల, సరైన సమయపాలన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం జీవితంలో ఉన్నత స్ధాయికి ఎదగడానికి తోత్వడతాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులు వెయ్యాలని తెలిపారు. మానసికంగా బలవంతులుగా ఉన్నంతవరకు మనలను ఎవ్వరు ఏమి చేయలేరని అన్నారు.
కంప్యూటర్ సైన్స్ విద్యార్ధులు ఆధునిక టెక్నాలజిలపై అవగాహను పెంపొందించుకొని ఉన్నత స్ధాయిలో స్ధిరపడాలని అకాంక్షించారు. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని వైఫల్యాలను అధిగమించి లక్ష్య సాధనకు ఉపక్రమించి, అనుకున్న లక్ష్యాలపై ధృష్టిని సారించినట్లైతే తప్పక విజయం సాధించవచ్చని తెలిపారు. సిఎస్‌ఇ హెచ్‌ఒడి డాక్టర్ పి హరిణి మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి జీవితంలో ఉన్నత స్ధాయిలో పూరోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
టెక్ మహింద్రా ప్రతినిధి ఎం వెంకట గోపీ చంద్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్ధులు వాస్తవ పరిస్తుతులను అవగాహన చేసుకొని ప్రతిరోజు తమ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని చెప్పారు. తమ సామర్ధ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. విద్యార్దులు ఒక టెక్నాలజిపై దృష్టి సారించి దానిపై పట్టు సాధించాలని కోరారు. ఉద్యోగాలకు దగ్గర దారులు వెతికి అనవసరంగా సమయం, ధనం వృధా చేయవద్దని తెలిపారు. ఈ సందర్బంగా ఎంఎల్‌ఎ ఎంఎం కోండయ్య, ఎం వెంకట గోపీ చంద్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ సిఎస్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి పాల్గొన్నారు.