Home బాపట్ల సత్తా చాటిన సెయింట్ ఆన్స్ విద్యార్థులు

సత్తా చాటిన సెయింట్ ఆన్స్ విద్యార్థులు

12
0

చీరాల (DN5 News) : జాతీయ స్థాయి పోటీల్లో స్థానిక సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్ధులు విశేష ప్రతిభ కనబరిచారు. ఒంగోలులోని రైజ్ కృష్ణ సాయి ఇంజనీరింగ్‌ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్ రైజ్ ఫ్యూజన్ 2026లో పురుషుల వాలీబాల్ జట్టు, మహిళల కబడ్డీ జట్టు విజేతలుగా నిలిచినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణరావు, కరస్పాండెంట్ ఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. పురుషుల వాలీబాల్ పోటీల్లో 26 జట్లు పాల్గొనగా ఫైనల్లో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ జట్టుతో తలపడి తమ విద్యార్ధులు విజయం సాధించినట్లు తెలిపారు. జట్టులో ఆర్ రమణ, జివిఆర్ తేజారెడ్డి, కె ఆండ్రూస్, జి మైకేల్, కె డాని, కె సాయికుమార్, ఎం రేమ్వంత్ వెంకట మణికుమార్ పాల్గొన్నట్లు పిడి అన్నం శ్రీనివాసరావు తెలిపారు. మహిళల కబడ్డీ పోటీల్లో 18 జట్లు పోటీపడగా ఫైనల్లో రైజ్ ఇంజినీరింగ్ కళాశాల జట్టును ఓడించి తమ విద్యార్ధినులు విజేతగా నిలిచినట్లు తెలిపారు. కబడ్డీ జట్టులో వి మానస, కె అనిత, బి ప్రవల్లిక, బి శృతి పావని, పి హరిణి, టి శ్రీవిద్యా, డి రమ్య, ఎం శ్రావణి, ఎం సోనాలి, జి శ్రీపూజిత, ఎం అనిత, సి సంజన పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు, మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి, డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ వనమా దొర నాగసాయినాథ్, హెచ్‌ఒడిలు విద్యార్థులు పాల్గొన్నారు.