చీరాల (DN5 News) : స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ (StANNs Eng’College) విద్యార్ధుల వాలీబాల్ జట్టు ఆమరావతి విట్ యూనివర్సిటి జాతీయ స్ధాయి యూత్ పెస్టివల్ వాలీ బాల్ పోటీల్లో రన్నర్స్‌గా గెలుపొందినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. విట్ యూనివర్సిటి ఇటీవల జాతీయ స్ధాయి యూత్ పెస్టివల్ విటోపియా `2026 సందర్బంగా జరిగిన వాలీబాల్ పోటీల్లో 46 జట్లతో పోటీపడి తమ విద్యార్ధులు ఫైనల్ పోటీల్లో ఎస్‌ఆర్‌ఎం జట్టుతో ఆడి రన్నర్స్‌గా నిలచి నగదు బహుమతి పొందినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. జట్టులో ఆర్ రమణ, జివిఆర్ తేజారెడ్డి, కె ఆండ్రూస్, జి మైకేల్, కె డాని, కె సాయి కుమార్, ఎం రెంవంత్ వెంకట మణి కుమార్ పాల్గొన్నట్లు పిడి అన్నం శ్రీనివాసరావు తెలిపారు. పవర్ లిప్టింగ్ పోటీల్లో టి వివేక్ బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణ మూర్తి, డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, వనమా దొర నాగ సాయినాద్, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.






