తిరుమల : శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. బ్రిడ్జిపి రూ. 650.5కోట్లతో స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మించారు. ఈ వంతెన వల్ల తిరుపతి బస్టాండు ప్రాంతంలో రద్దీ తగ్గుతుంది. అంతే కాకుండా భక్తులు నేరుగా కపిలతీర్థం చేరుకోవచ్చు. అక్కడ నుంచి అలిపిరికి వెళ్ళవచ్చు. 7కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్ నిర్మించారు. కరకంబాడీ రోడ్డు, తిరుచానూరు రోడ్డు నుంచి వచ్చే భక్తులు నగరంలోకి వెళ్లకుండా నేరుగా తిరుమల కొండకిందకు చేరుకోవచ్చు.
ఎస్‌వి ఆర్ట్సు కళాశాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రూ. 37.80కోట్ల వ్యయంతో రెండు హాస్టల్ బ్లాకులు నిర్మించింది. వాటినీ సిఎం ప్రారంభించారు. 181గదులు కలిగిన ఈ భవనాలలో 750విద్యార్థులకు వసతి కల్పించవచ్చు. అలాగే టిటిడి దేవస్థానంలో పని చేసే 3518మంది ఉద్యోగులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. మిగిలిన వారికి 45రోజులలో పంపిణీ చేస్తామని చెప్పారు.