Home ప్రకాశం పాపారావు స్కూల్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

పాపారావు స్కూల్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

456
0

కొండపి : కె.ఉప్పలపాడులోని పాపారావు పబ్లిక్ స్కూల్ లో శ్రీ క్రిష్టాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా స్కూల్ లో ఉట్టి ఏర్పాటు చేసి, విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాద్యాయులు ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముందుగా చిన్న పిల్లలను చిన్ని కృష్ణయ్యలుగా అలంకరించారు. అలాగే విద్యార్థులుచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండంట్ చిడిపోతు శిశిర్ చౌదరి ఉట్టికొట్టి విద్యార్థులను ఉత్సాహ పరిచారు. ఉట్టికొట్టడంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, ఉపాద్యాయులకు శిశిర్ చౌదరి చేతుల మీదుగా నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ చిడిపోతు మౌనిక పాల్గొన్నారు.