– ట్రస్టు సేవలను ప్రశంసించిన శాసన సభ్యులు ఎంఎం కొండయ్య
– పేదల వైద్య ఖర్చల నిమిత్తం ట్రస్టు ఆర్ధిక సహాయం
– పేద విద్యార్ధులకు ఫీజుల చెల్లింపుకు సహాయం
– ఆరు నెలలపాటు టీబి రోగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ
చీరాల (Chirala) : వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానంద సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో భూరీ విరాళం ప్రకటించారు. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఆవరణలో స్వామి శ్రీశ్రీశ్రీ రామానంద సరస్వతి స్వామి (Ramananda Saraswathi) వారి దివ్య ఆశీస్సులతో సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. శాసన సభ్యులు ఎంఎం కొండయ్యతో (MLA MM Kondaiah) కలిసి పేదలకు వైద్య సహాయం, పేద విద్యార్ధులకు ఆర్ధిక సహాయం, కుష్టు రోగులకు ఆరు నెలలపాటు సుమారు 200మందికి పౌష్టికాహార కిట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు శుక్రవారం చేపట్టారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభయాన్ పౌష్టిక పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. పేరాల ఓంకార క్షేత్రం నిర్మాణానికి రూ.2లక్షలు, లింగాపురం శివాలయంలో విగ్రప్రతిష్టకు రూ.ఒక లక్షల విరాళం అందజేశారు.

ఈ సందర్భంగా శాసన సభ్యులు ఎంఎం కొండయ్య మాట్లాడారు. స్వామి రామానంద సరస్వతి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మిక రంగాల్లో స్వామివారు చేస్తున్న కృషి పేదలకు ఎంతో బరోసా ఇస్తుందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని కోరారు. ట్రస్టు ద్వారా అందజేస్తున్న ఆర్ధిక సహాయం వివరాలను ట్రస్టు మేనేజర్ నారాయణం సురేష్ తెలిపారు. ఎన్ పార్వతికి రూ.2వేలు, కె లతకు రూ.2500, ఎం శ్రీలక్ష్మికి రూ.3వేలు, ఎం పార్వతికి రూ.2500, పరిమి శివయ్యకు వైద్య ఖర్చులకు రూ.5వేలు, కె శశికుమార్‌కు రూ.10వేలు వైద్య ఖర్చులకు సహాయం చేసినట్లు తెలిపారు. ఆరు నెలల పాటు వీరందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం ఇవ్వనున్నట్లు తెలిపారు. కోట వెంకటరమణకు రూ.30వేలు, పఠాన్ ఫర్‌జాన్‌కు రూ.30వేలు కళాశాల ఫీజుల నిమిత్తం చెక్కులు అందజేశారు. నాగవరపు పార్వతి ఇంటి నిర్మాణానికి రూ.25వేలు చెక్కు అందజేశారు.

పోస్టు మాన్‌కు రూ.7500 విలువైన సైకిల్, మహాశివరాత్రి పండుగ సందర్భంగా చీరాల శివాలయం వద్ద అన్నదానంకు రూ.20వేలు కె శ్రీనివాసరావుకు అందజేశారు. కీర్తివారిపాలెం గ్రామంలో సిమెంటు బల్లల ఏర్పాటుకు రూ.15వేలు అందజేశారు. అనంతరం చీరాల ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో నూతనంగా నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ పనులను శాసన సభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి శ్రీ రామానంద సరస్వతి స్వామి వారు పరిశీలించారు. వీరి వెంట హాస్పిటల్స్ సిబ్బంది, కూటమి నాయకులు, రామానంద ట్రస్ట్ ప్రతినిధులు కుమార్, వైద్యశాల సూపర్నెంట్ శ్రీకాంత్, పూర్వి స్కాన్ ఎండి డాక్టర్ పేట శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.





