చీరాల (DN5 News): ఇంటర్ పరీక్షa ఫలితాల్లో శ్రీ మేధావి కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు జయకేతనం ఎగుర వేశారని కళాశాల డైరెక్టర్ ఎంవి దుర్గాకుమార్ అన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి, సిఇసి అన్ని గ్రూపుల్లో తమ విద్యార్థులు ఫలితాల పరంపర కొనసాగించారని అన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తమ విద్యార్ధులు అత్యధిక మార్కులు సాధించినట్లు తెలిపారు. కళాశాల ఆవరణలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్ ఎంఇసిలో మురికిపూడి ఎస్ఎల్ హర్షిత 974 మార్కులతో జిల్లా ప్రధమ స్థానం సాధించినట్లు తెలిపారు.
ఎంపిసిలో తాతా దాక్షిణ్య 968, బైపిసిలో పి జోష్ణ 983, జి శ్వేత 983, సిఇసిలో సాయి శ్రీ లహరి 939 మార్కులు సాధించి మూడు గ్రూపుల్లో పట్టణ ప్రధమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఎంఇసిలో మురికిపూడి వి కార్తీక్ 490 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం, ఎంపీసీలో గోలి యమున 465, బైపీసీలో పిన్నబోయిన చంద్రిక 431, సీఈసీలో కంచర్ల డేవిడ్ రాజు 436 మార్కులు సాధించి టౌన్ బెస్ట్ విద్యార్ధులుగా నిలిచారని తెలిపారు.
అత్యధిక మార్కులు సాధించేందుకు కృషి చేసిన తమ అధ్యాపకులు, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల ఆవరణలో విద్యార్థులకు స్వీట్స్ పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలు సాధించిన విద్యార్ధులు విజయ కేతనం చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి సత్యనారాయణ, ఎఒ సిహెచ్ అవినాష్, అహ్మద్, గోపి కృష్ణ పాల్గొన్నారు.