చీరాల (DN5 News) : ఇంటర్ పరీక్షల ఫలితాల్లో శ్రీ గౌతమి విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఫలితాల సాధనలో అధ్యాపకుల కృషి, విద్యార్ధుల పట్టుదల, కళాశాల యాజమాన్య నిబద్దతకు నిదర్శనమని కళాశాల డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు (ఎంవి) పేర్కొన్నారు. తమ కళాశాల విద్యార్ధులు అన్ని విభాగాల్లో నిలకడైన ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు.
జూనియర్ ఇంటర్ ఎంపీసీలో దుబ్బు సాహితి, బి పూర్ణపృథ్వి 465, బి చంద్రిక, డి గీతికా, ఎస్‌కె రిజ్వానా, జె చరిత, ఎస్ కౌషీత సాయిరాగ 464, వంగిసేనసే విఎస్ సాయి కిరణ్ 463, కన్నమరెడ్డి నవ్య, ఇంకొల్లు బ్రాంచి విద్యార్ధిని కె భార్గవి 462, దుంప లహరి 460 మార్కులు సాధించగా జూనియర్ బైపిసిలో కె చంద్రిక 434 మార్కులతో టౌస్ ఫస్ట్, రావూరి స్నేహిత 433 మార్కులతో టౌన్ సెకెండ్, పల్లా యమున , కోట లక్ష్మి నారాయని 427, రెడ్డి దేవవర్షిణి 420, జూనియర్ ఇంటర్ సిఇసిలో గర్నెపూడి లిడియ గ్రేస్ 427 మార్కులు సాధించారని అన్నారు.
సీనియర్ ఇంటర్ ఎంపీసీలో వై జయదుర్గ, పి యోగానంద్ 988 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించగా వై కార్తీక్ మహేంద్రరెడ్డి 987, కె యామిని 985, అడప శ్రీనివాస్ 984, కందల జ్యోతిక, ఇంకొల్లు బ్రాంచి విద్యార్ధిని కె సాహితి 983, ఇంకొల్లు బ్రాంచి విద్యార్ధిని కె జయలక్ష్మి 982, ఇంకొల్లు బ్రాంచి విద్యార్ధిని షేక్ రిజ్వన, ఛోడిపిల్లి స్వాతి 981 మార్కులు సాధించారని అన్నారు.
సీనియర్ బైపిసిలో సజ్జా చైతన్య వాణి, డి కమల కుమారి 982 మార్కులతో టౌస్ ఫస్ట్, ఎ వివేక్ వర్ధస్ 971, నందమూడి పరిమళ 970, ఎం అష్ల్యాన్ 966 మార్కులు సాధించారని అన్నారు. ఘన విజయం సాధించిన విద్యార్థులు, బోధించిన అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.