– ఏడాదిలో 200మందికి యాజియోగ్రాం పరీక్షలు
– 70మందికి స్టెంట్లు వేయడం
– 20మందికి ట్రామా ఆపరేషన్లు
– 4వేలకుపైగా అత్యవసర వైద్య సేవలు
చీరాల (Chirala) : గత 10ఏళ్లుగా పట్టణంలో వైద్య సేవలు అందిస్తున్న ‘శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’ (Sri Gorantla Super speciality Hospital) నూతన భవనంలో ఆధునిక వైద్య పరికరాలు, అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్యశాల ఆవరణలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వైద్యశాల ఎండి డాక్టర్ గోరంట రాజేష్ (Dr.Gorantla Rajesh) మాట్లాడారు. తాము 2016లో వైద్య సేవలు ప్రారంభించినట్లు చెప్పారు. చీరాల, బాపట్ల పరిసర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. గత పదేళ్లలో అనేకమందికి నాణ్యమైన వైద్య సేవలు అందించినట్లు తెలిపారు.
కోవిడ్19 వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంత ప్రజలకు అత్యవసర సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని పేర్కొన్నారు. ఆ సమయంలో తమ వద్ద వైద్యం పొందిన వారి స్పందన చూచి తనకు చాలా ఆనందం కలిగించిందని అన్నారు. త్యవసర పరిస్థితుల్లో గుంటూరు, విజయవాడ వంటి దూరప్రాంతాలు పరుగులు తీసే పరిస్థితిలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, అలాంటి వారికి అత్యాధునిక, అత్యవసర వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని ఆలోచనకు బీజం పడిందని అన్నారు. గుండె నొప్పి, పక్షవాతం వచ్చిన వారికి తగిన వైద్యం, వైద్యులు అందుబాటులో లేని కారణంగా గుంటూరు, విజయవాడ వెళ్ళవలసిన పరిస్థితి ఉండేదని అన్నారు. అలా వెళ్తూ మార్గమధ్యంలో ఎంతోమంది చనిపోయారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో అత్యవసర వైద్యం అందిచే క్రిటికల్ కేర్ వైద్యులను అందుబాటులోకి తీసుకొని రావాలని ‘శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించినట్లు తెలిపారు.
తమ హాస్పిటల్ ద్వారా గత సంవత్సరంలో ఎమర్జెన్సీ సేవలు, గుండె, నర్ములకు సంబంధిత సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే వైద్య స్పెషలిస్టుల బృంధంను నియమించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సర కాలంలో 30వేలకు పైగా ఓపిడి కేసులు, 4వేలకు పైగా అత్యవసర కేసులకు తక్షణ చికిత్స అందించినట్లు తెలిపారు. తమ హాస్పిటల్ గుండె వైద్య విభాగం ద్వారా ఇప్పటికి 200 మందికి యాంజియో గ్రాం, 70 మందికిపైగా గుండెకు స్టెంట్లు వేసినట్లు తెలిపారు. న్యూరాలజీ విభాగం ద్వారా సమయానికి రక్తం గడ్డ కరిగే త్రాంబలైసిస్ ఇంజక్షన్ ద్వారా చికిత్స అందించడం వల్ల పక్షవాతం నుండి రక్షించగలిగినట్లు తెలిపారు. 20మందికి పైగా డికంప్రెసివ్ క్రనోటమి అనగా మెదడు ఆపరేషన్లను విజయవంతంగా చేసి ప్రాణాపాయ పరిస్థితి నుండి కాపాడినట్లు తెలిపారు.
తమ హాస్పిటల్లో 24గంటలు అత్యవసర, ట్రామ వైద్య సేవలు అందించగల వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఎమర్జెన్సీ ఫిజిషన్స్, కార్డియాలజీ, న్యూరాలజీ డాక్టర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తమ హాస్పిటల్ నందు అన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. కిడ్నీలో రాళ్లు, హెర్నియా, 24 గంటల కడుపునొప్పి, పసరు తిత్తి ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. డయాలసిస్ సేవలు, పూర్తిగా సెంట్రల్ మానిటరింగ్ కలిగిన ఐసియు, కాత్‌ల్యాబ్, సిటి స్కాన్, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.

రానున్న రోజుల్లో ఆరోగ్యశ్రీ సేవల ద్వారా పేదలకు అత్యాధునిక వైద్య సేవలు, ఆపరేషన్లు ఉచితంగా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బాధ్యతాయుతంగా మానవీయతతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో సేవలు విస్తరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ శ్రావణి (Dr. SRAVANI, MD Pediatrics), ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ డాక్టర్ వంశీకృష్ణ (Dr.VAMSI KRISHNA, MD emergency medicine), న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీజ, కార్డియాలజిస్ట్ డాక్టర్ కెవి సుబ్బారావు (Dr.KV Subbarao, MD,DM cardiology), క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జాన్‌పాల్ (Dr.JOHN PAUL SNEHITH, MBBS, casuality medical officer), అత్యవసర వైద్యసేవలు ఎండి డాక్టర్ విష్ణుచైతన్యరెడ్డి (Dr. VISHNU CHAITANYA REDDY, MD, emergency medicine), ఫిజియోథెరఫి పిజీషియన్ అసిస్టెంట్ డాక్టర్ రాజ్‌కుమార్ (Dr.RAJKUMAR, physiotherapy physician assistant), మాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సంతోష్‌కుమార్ (Dr. SANTHOSH KUMAR, MBBS, MEM, master & emergency medicine) పాల్గొన్నారు.






