Home బాపట్ల ఘనంగా ‘శ్రీమేధావి’ వార్షికోత్సవం

ఘనంగా ‘శ్రీమేధావి’ వార్షికోత్సవం

5
0

చీరాల (Chirala) : స్థానిక శ్రీమేధావి (Sri MedhaV) జూనియర్‌ కాలేజీ 14వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పద్మశాలి (Padmashaliya) కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సభలో శాసన సభ్యులు ఎంఎం కొండయ్య (MLA Kondaiah) మాట్లాడారు. విద్యార్ధులు ఆసక్తి, ఇష్టంతో చదివితే మంచి మార్కులతో ఉన్నతమైన భవిష్యత్తు పొందవచ్చని చెప్పారు. ఎవ్వరికైనా చదువు ఒక్కటే ఆనందమైన జీవితాన్ని ఇవ్వగలదని అన్నారు. చదువుతోపాటు ఆట, పాటలు, సామాజిక అంశాల్లోనూ అవగానతో మెలగాలని సూచించారు. పట్టణంలో 14ఏళ్లుగా విద్యార్ధులకు బోధన అందిస్తున్న శ్రీమేధావి జూనియర్‌ కాలేజీ భవిష్యత్తులో మరింత విస్తరించాలని కోరారు. అనంతరం విద్యార్ధుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ ఎంవి దుర్గాకుమార్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ మించాల సాంబశివరావు, ఎఎంసి ఛైర్మన్‌ కౌతరపు జనార్ధనరావు, ఎం ప్రసాదరావు పాల్గొన్నారు.