Home ఆంధ్రప్రదేశ్ ప్రత్యెక హోదా రాష్ట్ర ప్రజల హక్కు : దాసరి రాజా మాష్టారు

ప్రత్యెక హోదా రాష్ట్ర ప్రజల హక్కు : దాసరి రాజా మాష్టారు

389
0

కందుకూరు : కేంద్రంలోని బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేసిందని, విభాజన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ప్రత్యెక హోదా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల హక్కు అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, శిక్షణ శిభిరం డైరెక్టర్ దాసరి రాజా మాష్టారు పేర్కొన్నారు. కందుకూరులోని తెలుగువిజయం ప్రాంగణం లో జరుగుతున్న 157వ‌ బాచ్ శిక్ష‌ణ ముగింపు స‌భ‌కు హాజరైన కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి అన్నారు. ప్రజల కోసం పాటుపడే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిస్సహాయ స్థితిలో ఉండే పరిస్థితి వస్తోందని అన్నారు. ఇటువంటి సమయంలో అందరు చంద్రబాబుకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాలలో చంద్రబాబు గట్టి పోటీ అవుతారని మోడీ కక్ష కట్టారని పేర్కొన్నారు.

హోదా ఎవ్వరికీ ఇవ్వడం లేదని, అందుకే దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పాకే చంద్రబాబు ఒప్పుకున్నారని చెప్పారు.  కాని కేవలం పప్పు, బెల్లాలు మినహా ఏమీ చేయకపోవడం వల్లనే ప్రజా ఆకాంక్షల మేరకు హోదా అడుగుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా విభ‌జన హామీలు అమలు చేయకపోతే బీజేపీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని హెచ్చరించారు. బీజేపీతో కలసి జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో తన యంపీలు ఒక మాట, ఇక్కడ తనొక మాట మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీతో కలసి రాష్ట ప్రజలకు ద్రోహం చేస్తున్నారని రాజా మాష్టారు విమర్శించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలిచిన‌ విజేతలకు బహుమతులు అంద‌జేశారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్స్ ఇచ్చారు. శిక్షణకు గుంటూరు జిల్లా నుండి వేమూరు, తెనాలి, వినుకొండ, గుంటూరు పశ్చిమ, ప్రకాశం జిల్లా నుండి కొండపి, దర్శి, మార్కాపురం., నెల్లూరు జిల్లా నుండి గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల నుండి గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కందుకూరు జెడ్‌పిటిసి సభ్యులు శ్రీకాంత్, శిక్షణ శిభిరం సిబ్బంది కాకర్ల మల్లికార్జున్, పాపారావు పసుపులేటి, చైతన్య, పరమేశ్వర రెడ్డి చిట్టెం పాల్గొన్నారు.