Home ప్రకాశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ స్పందన

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ స్పందన

394
0

 

కొండెపి : ప్రకాశం జిల్లా కొండపి మండల ప్రజలు ప్రతి సోమవారం జరుగు “స్పందన” కార్యక్రమంలో ఎస్పీ సిద్దార్థ కౌశిల్ వద్దకు వెళ్లలేని, వెళ్లడానికి వీలుకాని అర్జీదారులు దగ్గరలోని పోలీస్ స్టేషన్, పోలీసు సర్కిల్ కార్యాలయం, డిఎస్పి కార్యాలయముకు మధ్యాహ్నం 1.30 నిమిషాల నుండి 3.00 గంటల మధ్య వచ్చి స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అర్జీలు ఇవ్వవచ్చునని ఎస్ఐ ప్రసాద్, సిఐ ప్రసాద్ తెలిపారు. అర్జీలను జిల్లా ఎస్పీ తీసుకున్నట్లుగా రసీదు ఇస్తామన్నారు. చట్టరీత్యా వాటిని పరిష్కరిస్తామన్నారు. అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.