చీరాల : భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే రసాయన ఎరువులు వాడాలని వ్యవసాయాధికారిణి ఇ ఫాతిమ పేర్కొన్నారు. చీరాల మండలం నక్కలవారిపాలెం, పుల్లాయపాలెం గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తొంది కార్యక్రమం నిర్వహించారు. చంద్రన్న భూసార పరిరక్షణ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు చేయించుకున్న రైతులకు భూసార పరీక్షా విశ్లేషణ పత్రాలు రైతులకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతపు నేలలో సూక్ష్మపోషకాలైన జింక్, ఇనుప ధాతులోప లక్షణాలతోపాటు సేంద్రియ కర్భనం తక్కువగా ఉందని వివరించారు. నివారణకు పచ్చిరొట్టపైర్ల వాడకంతోపాటు వ్యవసాయ శాఖ రాయితీపై అందజేసే సూక్ష్మపోషకాలను వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిఇఒలు సాంబశివరావు, మొబీనా పాల్గొన్నారు.