Home ప్రకాశం న్యాయ సేవతో పాటు సామాజిక సేవ

న్యాయ సేవతో పాటు సామాజిక సేవ

242
0

చీరాల : న్యాయ సేవ తో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో నిర్వహించాలని మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, న్యాయమూర్తి కృష్ణం కుట్టి మండల న్యాయసేవాధికార సంస్థ సభ్యులను కోరారు. కోర్టు ఆవరణలో న్యాయ సేవా అధికార సంస్థ మండల సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ పేదలకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యం అన్నారు. కరోనా విపత్కర సమయంలో నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు. వైద్య సహాయం ఉండాలన్నారు. ఆహారం, వైద్యం వంటి అత్యవసర సేవల కోసం న్యాయ సేవా అధికార సంస్థ హెల్ప్లైన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 15100, 9989166462, 9440621433 నంబర్లకు ఫోన్ చేయాలని చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపించిన వాళ్లు 104 ఫోన్ చేసి వైద్య సహాయం పొందాలన్నారు. ఇతర దేశాలు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కొత్త వ్యక్తుల వివరాలను ప్రభుత్వ అధికారులకు ఇవ్వాలని సూచించారు. ఈ విధంగా నిబంధనలు పాటిస్తూ కరోనా పై విజయం సాధించాలని కోరారు.