Home బాపట్ల స్కిల్ ఎక్సిలేటర్ ల్యాబ్ ప్రారంభం

స్కిల్ ఎక్సిలేటర్ ల్యాబ్ ప్రారంభం

5
0

చీరాల (DN5 News) : స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో స్కిల్ ఎక్సిలేటర్ ల్యాబ్‌ను గురువారం ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ ఐఐటీ ముంబై, ఎడ్యుపిరమిడ్ షైన్ సంస్థల సహకారంతో ల్యాబ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐఐటీ ముంబైకి చెందిన ట్రైనింగ్ మేనేజర్ రేణు సింగ్ ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జె కవిత, డాక్టర్ సి సుబ్బారావు, వనమా దొర నాగ సాయినాథ్, మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి పాల్గొన్నారు.