Home బాపట్ల సర్వీసు రోడ్డుకు స్థల పరిశీలన

సర్వీసు రోడ్డుకు స్థల పరిశీలన

12
0

చీరాల (DN5 News) : స్థానిక కెజిబివి, ఎపి మోడల్ స్కూల్ ఎదురుగా జాతీయ రహదారికి నేరుగా అనుసంధానం ఉండటం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశముందని పేర్కొంటూ ఆ ప్రాంతంలో ప్రత్యేక సర్వీసు రోడ్డు నిర్మించాలని చేసిన విజ్ఞప్తిపై జాతీయ రహదారి అధికారులు స్పందించారు. సీనియర్ జర్నలిస్టు డి విజయభాస్కర్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం అధికారులు మంగళవారం ఆ స్థలాన్ని పరిశీలించారు. జతీయ రహదారి గుంటూరు డివిజన్ డిఇ మహ్మద్ ఆదేశాల మేరకు సూపర్వైజర్ గోపాలకృష్ణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలోని పాఠశాల్లోని వెయ్యిమందికిపైగా విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారని, డిజేబుల్ ఫిజియోథెరపీ సెంటర్, వెలుగు శిక్షణా కేంద్రం వంటి సంస్థలు ఉండటంతో ప్రస్తుతం రాకపోకలు ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. భవిష్యత్తులో ట్రాఫిక్ పెరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కెజిబివి స్పెషల్ ఆఫీసర్ టివి సుజాత, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్ ఆంజనేయులు, సీనియర్ జర్నలిస్టు డి విజయభాస్కర్ వివరించారు. దీనిపై స్పందించిన హైవే అధికారులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాల మేరకు సర్వీసు రోడ్డు నిర్మాణంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.