Home ఆధ్యాత్మికం చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూత

చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూత

29
0

అద్దంకి (DN5 News) : శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం చంద్రగ్రహణం కారణంగా సోమవారం రాత్రి 7 గంటల తరువాత శాస్త్రోప్తంగా ప్రధాన అర్చకులు కోటా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మూసివేశారు. తిరిగి చంద్రగ్రహణం వీడిన తర్వాత దేవస్థానాన్ని శుభ్రపరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారిని దర్శనానికి అనుమతిస్తారని సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మదుమంచి తిమ్మనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండల చైర్మన్ చుండూరి మురళి సుధాకరరావు, అర్చకులు పెద్దబాబు, దేవస్థానం సిబ్బంది, సింగయ్య, మహిళా, కార్మికులు పాల్గొన్నారు.