Home ఆంధ్రప్రదేశ్ సింధు ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్

సింధు ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్

499
0

అమరావతి : సింధు… ఈమె ఎవరో అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఆమె తండ్రి ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం అందరికీ తెలిసిన వ్యక్తి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధుకు డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2009 సెప్టెంబరు 2న వైెఎస్ తో పాటు ప్రమాదంలో మరణించిన వైఎస్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం కుమార్తెకు కారుణ్యనియామకం కింద సింధూ గ్రూప్ వన్ ఉద్యోగమిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు ఇచ్చారు.