Home బాపట్ల షూటింగ్ బాల్ పోటీలలో ప్రధమ స్థానంలో బాపట్ల జట్టు

షూటింగ్ బాల్ పోటీలలో ప్రధమ స్థానంలో బాపట్ల జట్టు

21
0

చీరాల (chirala) : రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో బాపట్ల జిల్లా బాలుర, బాలికలు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈనెల 9, 10, 11 మార్టూరులోని వివేకానంద నెక్స్ట్ జెన్ ఇంగ్లీష్ స్కూల్ నందు రాష్ట్ర స్థాయి అండర్ 19 బాల బాలికల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రం నుండి 13 జిల్లాలు పాల్గొనగా బాపట్ల జిల్లా బాలురు అనకాపల్లి జిల్లాపై 2-1 తేడాతో ప్రధమ స్థానం సాధించారు. బాలికల విభాగంలో బాపట్ల జిల్లా అనకాపల్లి జిల్లాపై 2-0 తేడాతో ప్రధమ స్థానాన్ని సాధించారు.

ఈ సందర్భంగా చీరాలలోని ప్రేమ హార్ట్ హాస్పిటల్ ఎండీ, బాపట్ల జిల్లా షూ టింగ్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇస్తర్ల బాబురావు గెలుపొందిన బాల బాలికలను అభినందించారు. క్రీడలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసానికి ఎంతో అవసరమని తెలిపారు. గెలుపు ఓటమిలు సహజమని ప్రతి ఒక్క క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్ర బాలుర, బాలికల కోచ్ లు తుమ్మ శ్రీనివాసరెడ్డి, మురళిరెడ్డి, బొనిగల యశోద కృష్ణ, పీఈటీలు కె రాణి, టీ ఈశ్వరి, పేరెంట్స్ పాల్గొన్నారు.