Home బాపట్ల కామాక్షి హాస్పిటల్‌ ఆధ్వర్యంలో అన్నదానం

కామాక్షి హాస్పిటల్‌ ఆధ్వర్యంలో అన్నదానం

35
0

చీరాల : అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని, ఎంతో పవిత్రమైన అయ్యప్ప దీక్షలో వున్న అయ్యప్ప స్వాములకు సద్ది ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యమని శ్రీ కామాక్షి కేర్‌ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్ తాడెవలస దేవరాజు అన్నారు. అయ్యప్ప స్వాముల భక్త బృందం ఆధ్వర్యంలో పేరాల శివాలయంలో గత 30 రోజులుగా ప్రతిరోజు 200 మంది అయ్యప్ప, భవాని, శివ దీక్ష చేస్తున్న భక్తులకు మధ్యాహ్నం సద్ది వితరణ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సద్ది ఏర్పాటు చేసేందుకు తనకు అవకాశం రావడం గొప్పవిషయంగా భావిస్తున్నట్లు చెప్పారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయనకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో గురు స్వామి తులసి రామ్, అయ్యప్ప స్వాములు రంగారావు, శివ, లక్ష్మణ్, లాలు, సతీష్, భాను, హరి మాస్టర్, అయ్యప్ప మాలధారణ స్వాములు పాల్గొన్నారు.