Home ప్రకాశం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడం ద్వారా బ్యాంకు ల విశ్వాసం పొందాలి

తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడం ద్వారా బ్యాంకు ల విశ్వాసం పొందాలి

547
0

పెద్దారవీడు : మండల కేంద్రంలో వెలుగు ఆఫీస్ నందు స్రీనిధి రుణాలఫై అవగహన సదస్సు నిర్వహించారు. సదస్సులో డివిజన్ స్రీనిధి రికవరీ అధికారి జయకుమార్ మాట్లాడుతూ స్రీనిధి రుణాల వల్ల కలిగే ప్రయోజనాలు గురించి డ్వాక్రా సంఘాల మహిళలకు వివరించారు.

బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా బ్యాంకుల విశ్వాసం పొందాలన్నారు. అలా చెల్లిస్తే మీ వ్యాపార అవసరాలకు తగినంత రుణం, ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమములో ఏపీఎం నాగముత్యాలు, సిసిలు నారాయణ రెడ్డి, మనోకుమారి, సాయులు,
శ్రీనివాసులు, కంప్యూటర్ ఆపరేటర్ భారతి, పలు గ్రామాల నుండి వచ్చినా డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.