Home బాపట్ల నివేశన స్థల దరఖాస్తులు పరిశీలన : కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

నివేశన స్థల దరఖాస్తులు పరిశీలన : కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

11
0

చినగంజాం (DN5 News) : ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. మండలంలోని గొనసపూడిలో ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల స్థితిగతులు మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో ఇండ్ల స్థలాల కోసం 12 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు దారులలో మెడబలిమి దానమ్మ, భర్త బోసు బాబు వారి స్థితిగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు ఏ విధంగా చేసుకున్నారు, ఎవరికి చేసుకున్నారు, ఎక్కడ చేశారని ఆన్లైన్ దరఖాస్తు ఆధారంగా వారి వివరాలు అడిగారు. దానమ్మ తనకు భర్త లేడని, ఉండడానికి నివాసం లేదని, తన మామ ఇంట్లో తలదాచు కుంటున్నానని తెలిపింది. ఆమెకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని, అందుకు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నానని ఆమె కలెక్టర్‌కు తెలిపారు.

ఇండ్ల స్థలాల కోసం గోనసపూడిలో దరఖాస్తు చేసుకున్న 12 మందికి ఒక్కొక్కరికి 3 సెంట్లు చొప్పున ఎల్‌పిఎం సంఖ్య 1179 లోని 36 సెంట్లు ఖాళీ ప్లాట్లను ఆయన పరిశీలించారు. ఆ స్థలంలో ప్లాట్లు ఖాళీగా ఉండుటకు కారణాలు ఆర్డిఓను అడిగి తెలుసుకున్నారు. చీరాల డివిజన్లో ఇళ్ల స్థలాల ధరఖాస్తుల విషయమై ఆర్డిఓను ఆరా తీశారు. కార్యక్రమంలో చీరాల ఆర్‌డిఒ చంద్రశేఖర్ నాయుడు, చినగంజాం తహశీల్దారు కె ప్రభాకరరావు, విఆర్‌ఒ నాగరాజు పాల్గొన్నారు.